కంటికి రెప్పలా పెంచిన ఏడేళ్ల కూతురు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందడంతో శోకసంద్రంలో మునిగిపోయాడు ఆ తండ్రి. వైద్య సిబ్బంది ఆమె మృతదేహాన్ని స్ట్రెచర్‌పై తీసుకొచ్చి ఆస్పత్రి మెయిన్ ఎంట్రాన్స్ మెట్ల వద్ద ఉంచారు. బిడ్డ శవాన్ని ఇంటికి తీసుకెళ్దామంటే చేతిలో అంత డబ్బు లేదు. దీంతో ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్‌ను కోరినా అధికారులు అంగీకరించలేదు. ఇక చేసేదేం లేక ఆటో స్టాండ్ వరకు చేతులపైనే కూతురు శవాన్ని మోసుకెళ్లాడు ఆ తండ్రి. ఈ ఘటన రెండ్రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ కూతుర్ని మోసుకెళ్లిన తండ్రి పేరు సంపత్ కుమార్.

#karimnagar
#telangana
#daughter
#govthospital
#father
#peddapalli
#ambulance
#trs
#cmkcr
#bangarutelangana
#kalvasrirampur
#sampathkumar
#komalatha